విజయ్ దేవరకొండ ఫ్రాన్స్ కు వెళ్ళేది గర్ల్ ఫ్రెండ్ కోసమా ?


టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ వేసవి సెలవులను ఎంజాయ్ చేయడానికి ఫ్రాన్స్ వెళ్తున్నాడు. డియర్ కామ్రేడ్ చిత్రాన్ని పూర్తిచేసిన ఈ హీరో ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రం లో బైక్ రేసర్ గా నటిస్తున్నాడు దాంతో చెన్నైలో బైక్ రేసింగ్ కు సంబంధించి శిక్షణ కూడా తీసుకున్నాడు.

డియర్ కామ్రేడ్ చిత్రం జూలై 26 న విడుదల అవుతుండటంతో ఈలోపు వారం రోజుల వెకేషన్ కోసం ఫ్రాన్స్ ని ఎంచుకున్నాడు విజయ్ దేవరకొండ. అక్కడికి తన కుటుంబంతో కలిసి వెళ్తున్నాడు. అయితే ఫ్రాన్స్ లో విజయ్ దేవరకొండ కు గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కోసమే విదేశాలకు వెళ్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ విదేశీ వనిత తో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెబుతున్నప్పటికీ ఇంకా ఏదో ఏదో ఉన్నట్లుగా అర్థం అవుతోంది.