వరల్డ్ ఫేమస్ లవర్ లాస్ట్ అంటే ఎలా దేవరకొండ?


Is vijay deverakonda deciding to quit love stories a right decision
వరల్డ్ ఫేమస్ లవర్ లాస్ట్ అంటే ఎలా దేవరకొండ?

విజయ్ దేవరకొండ చాలా తక్కువ సమయంలోనే హీరోగా తన కెరీర్ ను బిల్డ్ చేసుకున్నాడు. తక్కువ కాలంలోనే బ్లాక్ బస్టర్ హిట్స్ తో విజయ్ దేవరకొండ కెరీర్ హీరోగా పైపైకి వెళ్ళింది. గతేడాది డియర్ కామ్రేడ్ చిత్రంతో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ గా మన ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమైంది. నిన్ననే ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. 9న ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఎప్పుడూ స్టేజ్ మీద ఏదొక స్పెషలిటీ చూపిస్తూ వచ్చే విజయ్, ఈసారి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. వరల్డ్ ఫేమస్ లవర్ తన కెరీర్ లో లాస్ట్ లవ్ స్టోరీ అని ప్రకటించాడు దేవరకొండ.

తన కెరీర్ లో మారుస్తూ వస్తున్నానని, ఇంతకు ముందు కంటే పరిణితి చెందుతున్నానని, కథల ఎంపికలో కూడా మారాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. అందుకనే లవ్ స్టోరీస్ కు ఇక బై చెప్పేదామనుకుంటున్నానని రివీల్ చేసాడు. వరల్డ్ ఫేమస్ లవర్ తన కెరీర్ లో చేసిన అత్యంత ప్యూర్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా వెల్లడించాడు.

స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు కానీ విజయ్ దేవరకొండ కెరీర్ చూసుకుంటే మొదటి నుండి తన హిట్స్ అన్నీ లవ్ స్టోరీస్ మాత్రమే. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం ఇలా అన్నీ లవ్ స్టోరీస్ తోనే హిట్స్ కొట్టాడు. టాక్సీవాలా ఒక్కటే దీనికి మినహాయింపు అనుకోవచ్చు. ఇలా తక్కువ సమయంలోనే లవ్ స్టోరీస్ తో హిట్స్ కొట్టిన విజయ్ దేవరకొండ ఇక లవ్ స్టోరీస్ చేయను అంటే అది తన కెరీర్ కు ప్లస్సే అవుతుందా? అయితే ఇంకా విజయ్ యంగ్ ఏజ్ లోనే ఉన్నాడు. ఇప్పుడే లవ్ స్టోరీస్ కాదనుకుంటే అది కెరీర్ కు ఇబ్బంది కాదా?

విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా, క్యాథెరిన్, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్ లు హీరోయిన్లుగా నటించారు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కెఎస్ రామారావు నిర్మించారు.