విజయ్ దేవరకొండ వై ఎస్ జగన్ పాత్రలో


Is Vijay Deverakonda playing Jagan in Yatra

గీత గోవిందం చిత్రంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ కాగా గీత గోవిందం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ హీరో తాజాగా యాత్ర అనే బయోపిక్ చిత్రంలో వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే అది నిజామా ? అంటే డౌటే ! అయితే ఈ ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు . దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం ” యాత్ర ” . వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న విషయం తెలిసిందే . జగపతిబాబు , అనసూయ , పోసాని తదితర ప్రముఖులు ఈ చిత్రంలో నటిస్తున్నారు .

ఇక వై ఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ స్టార్ హీరో కార్తీ నటించనున్నట్లు తెలిసింది అయితే అది ఇప్పుడు బెడిసి కొట్టినట్లు దాంతో ఆ పాత్రలో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు తెలుస్తోంది . దర్శకుడు మహి విజయ్ ని అడిగాడట కానీ ఇంకా విజయ్ దేవరకొండ మాత్రం కన్ఫర్మ్ చేయలేదు . ఒకవేళ విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇస్తే యాత్రలో జగన్ పాత్రలో కనిపిస్తాడు లేదంటే జగన్ పాత్రలో మరో నటుడు . గీత గోవిందంతో అనూహ్యమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ యాత్రలో నటించడానికి ఒప్పుకుంటాడా ? అన్నది పెద్ద ప్రశ్నే !

English Title: Is Vijay Deverakonda playing Jagan in Yatra