ఆ సినిమా వాయిదాపడనుందా ?


Is Vishal Ayogya postponed

విశాల్ హీరోగా నటించిన తమిళ చిత్రం ” అయోగ్య ” రిలీజ్ ఏప్రిల్ 19 న అని ప్రకటించారు కానీ ఇప్పుడు అందు తున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 19 న అయోగ్య రిలీజ్ అవడం కష్టమే అని తెలుస్తోంది ఎందుకంటే కొంత ప్యాచ్ వర్క్ ఉంది అలాగే విశాల్ పెళ్లి పనులు కూడా ఉన్నాయి కాబట్టి ఈలోపు అనుకున్నట్లుగా అన్నీ కంప్లీట్ అయితే ఏప్రిల్ 19 న సినిమా రిలీజ్ ఉంటుంది లేకపోతే మేనెలలో రిలీజ్ చేస్తారట .

 

తెలుగులో ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రాన్ని తమిళ్ లో అయోగ్య పేరుతో రీమేక్ చేస్తున్నారు . తెలుగు తో పాటుగా హిందీ లో రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది దాంతో అయోగ్య హిట్ పై చాలా నమ్మకంగా ఉన్నాడు విశాల్ . నిన్ననే విశాల్ – అనీషా ల వివాహ నిశ్చితార్థం జరిగింది హైదరాబాద్ లో . ఇక పెళ్లి కావడమే తరువాయి .

English Title : Is Vishal Ayogya postponed ?