హీరోయిన్ కోసం దొంగ‌గా మారిన హీరో!


Ishan become a thief for Janhvi kapoor
Ishan become a thief for Janhvi kapoor

క్రేజీ హీరోయిన్ కోసం ఓ హీరో త‌ను దొంగ‌గా మారాన‌ని ఒప్పేసురున్నాడు. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ముద్దుల కూతురు జాన్వి కోసం దొంగ‌త‌నం చేశాన‌ని, ముందు త‌ను దొంగిలించాల‌ని ప్ర‌య‌త్నించి విఫ‌లం కావ‌డం వ‌ల్లే తాను దొంగ‌త‌నం చేయాల్ని వ‌చ్చింద‌ని యంగ్ హీరో చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ యంగ్ హీరో మ‌రెవ‌రో కాదు జాన్విక‌పూర్ రూమ‌ర్డ్ బాయ్‌ఫ్రెండ్ ఇషాన్ క‌ట్ట‌ర్‌. మ‌రాఠీ చిత్రం `సైర‌ట్‌` ఆధారంగా క‌ర‌ణ్‌జోహార్ నిర్మించిన `ద‌ఢ‌క్‌` చిత్రం ద్వారా ఇషాన్ క‌ట్ట‌ర్‌, జాన్వీక‌పూర్ హీరో హీరోయిన్‌లుగా బాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే.

ఈ సినిమా చిత్రీర‌క‌ర‌ణ స‌మ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింద‌ని, `ద‌ఢ‌క్‌` రిలీజ్ త‌రువాత నుంచి ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డుప్తోంద‌ని బాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల నేహా దూపియా రేడియో షోలో పాల్గొన్న ఇషాన్ క‌ట్ట‌ర్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. సారా అలీఖాన్ న‌ట‌నపై కామెంట్లు చేసిన ఇషాన్ జాన్వీపై మాత్రం ప్ర‌శంస‌లు కురిపించాడు. సారా కంటే జాన్వీ మంచి న‌టి అని ఈ ఇద్ద‌రిలో ఎవ‌రితో న‌టించ‌డానికి ఇష్ట‌ప‌డ‌తావ‌ని అడిగితే మాత్రం తాను జాన్వీక‌పూర్‌తో న‌టించ‌డానికే అంగీక‌రిస్తాన‌ని స్ప‌ష్టం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

జాన్వీ కోసం ఒమ‌న్‌లో ఓ పిల్లోని దొంగిలించాల్సి వ‌చ్చింద‌ని, అయితే ముందు త‌ను ప్ర‌య‌త్నించి విఫ‌లం కావ‌డం వ‌ల్లే త‌న కోసం దొంగ త‌నం చేశాన‌ని చెప్పేశారు ఇషాన్ క‌ట్టర్‌. జాన్వీకి బ‌హుమ‌తిగా ఇవ్వాల్సి వ‌స్తే పొల‌రాయిడ్ కెమెరాని గిఫ్ట్‌గా ఇస్తాన‌ని చెప్ప‌డంతో ఏంటీ ఇద్ద‌రు ప్రేమ‌లో వున్నారా అని ప్ర‌శ్నించింద‌ట‌. అయితే తాను ఇంకా ఎవ‌రి ప్రేమ‌లో ప‌డ‌లేద‌ని, ఇంకా తాను సింగిల్‌నేన‌ని ఇషాన్ వెల్ల‌డించ‌డం బాలీవుడ్ వ‌ర్గాల‌ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.