ఐశ్వ‌ర్య రాజేష్ `భూమి` ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!


ఐశ్వ‌ర్య రాజేష్ `భూమి` ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!
ఐశ్వ‌ర్య రాజేష్ `భూమి` ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!

`కౌస‌ల్య కృష్ణ‌మూర్తి` చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపుని ద‌క్కించుకుంది ఐశ్వ‌ర్య రాజేష్‌. న‌టుడు రాజేష్ కూతురిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వ‌ర్య మంచి న‌టిగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌రుస ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకుంటోంది. మిస్ మ్యాచ్‌.. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రాల్లో న‌టించిన ఐశ్వ‌ర్యారాజేష్ ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నానితో క‌లిసి `ట‌క్ జ‌గ‌దీష్‌`లో న‌టిస్తోంది.

ఈ మూవీ షూటింగ్ క‌రోనా కార‌ణంగా మ‌ధ్య‌లో ఆగిపోయింది. ఇదిలా వుంటే ప్ర‌స్తుతం త‌మిళంలో ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టిస్తున్న లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ `భూమిక‌`. ర‌తీంద్ర‌న్ ఆర్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఐశ్వ‌ర్యారాజేష్ న‌టిస్తున్న 25వ చిత్ర‌మిది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి `భూమి` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని హీరోయిన్ మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా ట్వీట్ట‌ర్ వేదిక‌గా సోమ‌వారం రిలీజ్ చేసింది.

ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు స‌మ‌ర్పిస్తున్నారు. కార్తికేయ‌న్, సంతానం, సుధాన్ సుంద‌ర‌మ్‌, జ‌య‌రామ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని చిత్ర బృందం వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలిసింది.