ఇస్మార్ట్ బ్యూటీకి క్రిష్ బంప‌ర్ ఆఫ‌ర్‌!


ఇస్మార్ట్ బ్యూటీకి క్రిష్ బంప‌ర్ ఆఫ‌ర్‌!
ఇస్మార్ట్ బ్యూటీకి క్రిష్ బంప‌ర్ ఆఫ‌ర్‌!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ 27 వ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ జగర్లాముడితో చేస్తున్న విష‌యం తెలిసిందే. పిరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత ఏ.ఎం.ర‌త్నం అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్ బిఫోర్ ఈ మూవీ కోసం హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో రెండు షెడ్యూళ్ల‌ని పూర్తి చేశారు.

`వ‌కీల్‌సాబ్‌` కార‌ణంగా మ‌ళ్లీ వాయిదా ప‌డిన ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే మ‌ళ్లీ మొద‌లైన విష‌యం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ సుంద‌రి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లేదా ఇలియానా న‌టించే అవ‌కాశం వుంద‌ని మ‌రో కీల‌క పాత్ర‌లో అర్జున్ రాంప‌ల్ న‌టిస్తున్నారంటూ వార్త‌లు వినిపించాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ న‌టించ‌నుంద‌ని తెలిసింది.

ఇటీవ‌లే నిధి అగ‌ర్వాల్ ఈ ప్రాజెక్ట్‌కు సైన్ చేసిన‌ట్టు చెబుతున్నారు. 170 నుంచి 180 కోట్ల రూపాయల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఇప్ప‌టికే భారీ స్థాయిలో సెట్‌ల‌ని సిద్ధం చేశారు. ప్ర‌స్తుతం ఆ సెట్‌ల‌లోనే షూటింగ్ జ‌రుగుతోంది.  పీరియడ్ డ్రామాగా రూపొందుతున్నీ ఈ మూవీ బడ్జెట్ విషయంలో  నిర్మాత ఎ.ఎం.రత్నం ఏమాత్రం రాజీ పడ‌టం లేద‌ట‌.