చైతూకి జోడీగా `ఇస్మార్ట్‌` బ్యూటీ!

చైతూకి జోడీగా `ఇస్మార్ట్‌` బ్యూటీ!
చైతూకి జోడీగా `ఇస్మార్ట్‌` బ్యూటీ!

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన `ఇస్మార్ట్ శంకర్` తో లైమ్ లైట్‌లోకి వ‌చ్చేసింది న‌భా న‌టేష్‌. ఈ మూవీలో తెలంగాణ అమ్మాయిగా చాలా బోల్డ్‌గా న‌టించి ప‌రిశ్ర‌మ వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షించింది.   తన గ్లాం షోతో కుర్ర‌కారుని కిర్రెక్కించేసింది. ఇటీవ‌ల బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో క‌లిసి `అల్లుడు అదుర్స్‌` న‌టించినా పెద్ద‌గా ఫలి‌తం లేకుండా పోయింది. ఈ సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది.

అయితే తాజాగా బంప‌ర్ ఆఫ‌ర్‌ని సొంతం చేసుకుంది నభా నటేష్. ప్ర‌స్తుతం విక్రమ్ కుమార్ `థాంక్స్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రం శ‌ర వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇందులో చైతో న‌భా న‌టేష్ రొమాన్స్ చేయబోతోంది. నభా దాదాపు ఖరారు అయ్యిందని, చర్చలు చివరి దశలో ఉన్నాయని టాక్‌. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వస్తుంరానుంది.

రొమాంటిక్ అంశాలతో కూడిన ఎమోషనల్ డ్రామాగా చిత్రీకరిస్తున్న‌ఈ చిత్రంలో ముగ్గురు మహిళాహీరోయిన్‌లు న‌టించ‌నున్నార‌ని తెలిసింది. బివిఎస్ రవి కథ అందించారు. అవార్డు విన్నింగ్  సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. నవీన్ నూలీ ఎడిటర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై  ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.