ప‌వ‌ర్‌స్టార్‌తో ఇస్మార్ట్ లేడీ  రొమాన్స్‌?ప‌వ‌ర్‌స్టార్‌తో ఇస్మార్ట్ లేడీ  రొమాన్స్‌?
ప‌వ‌ర్‌స్టార్‌తో ఇస్మార్ట్ లేడీ  రొమాన్స్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌స్తుతం `వ‌కీల్‌సాబ్‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ త‌రువాత మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` రీమేక్‌లో న‌టించ‌బోతున్నారు. ఈ మూవీ చేస్తూనే మ‌రో ప‌క్క క్రిష్ పా‌న్ ఇండియా చిత్రాన్ని కూడా ప‌ట్టాలెక్కిస్తున్నారు. ఏ.ఎం. ర‌త్నం ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

బాలీవుడ్ హీరో అర్జున్ రాంప‌ల్, శ్రీ‌లంక‌న్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇందులో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యాన్ని క్రిష్ వెల్ల‌డించ‌లేదు. ప‌వ‌న్‌కు జోడీగా న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది కూడా రివీల్ చేయ‌లేదు. అయితే తాజాగా ఈ మూవీలో ప‌వ‌న్ స‌ర‌స‌న `ఇస్మార్ట్ శంక‌ర్‌` బ్యూటీ నిధి అగ‌ర్వాల్ న‌టించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇందులో మెయిన్ హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ క‌నిపించ‌నుండ‌గా సెకండ్ హీరోయిన్ గా నిధి అగ‌ర్వాల్ క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. డిసెంబ‌ర్ నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని ద‌ర్శ‌కుడు క్రిష్ రిస్టార్ట్ చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే నిధి అగ‌ర్వాల్ ని సెకండ్ హీరోయిన్‌గా క్రిష్ ఎంపిక చేసిన‌ట్టు చెబుతున్నారు. అదే నిజ‌మైతే నిధి అగ‌ర్వాల్ కెరీర్ టాప్ లీగ్‌లోకి ఎంట‌ర్ కావ‌డం ఖాయం.