36 కోట్లు సాధించిన ఇస్మార్ట్ శంకర్

Ismart Shankar Collections
Ismart Shankar Collections

3 రోజుల్లో 36 కోట్ల వసూళ్ల ని సాధించింది ఇస్మార్ట్ శంకర్ . దాంతో దాదాపుగా పెట్టిన పెట్టుబడి రానుంది , అయితే ఈరోజు ఆదివారం కావడంతో ఈరోజు కూడా మరో 8 కోట్ల నుండి 10 కోట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈరోజుతో బయ్యర్లు అలాగే చిత్ర నిర్మాతలు కూడా పెట్టిన పెట్టుబడి మొత్తం రాబట్టుకునే ఛాన్స్ ఉంది . అంటే బయ్యర్లకు రేపటి నుండి వచ్చేదంతా లాభాలే ! ఇక నిర్మాతలకు ఎప్పుడో లాభాలు వచ్చాయి .

ఇక నుండి రాబోయేది అంతా బోనస్ అన్నమాట. రామ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ , నభా నటేష్ లు హీరోయిన్ లుగా నటించారు . పూరి జగన్నాధ్ తో కలిసి ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే . జూలై 18 న విడుదలైన ఈ చిత్రం విజయవంతం కావడంతో యూనిట్ అంతా చాలా సంతోషంగా ఉంది . బీర్ పార్టీ చేసుకుంటోంది . ఇక ఈరోజు ఆదివారం కావడంతో మరిన్ని బీర్లు పొంగి పోనున్నాయి పూరి కనెక్ట్స్ లో .