ఆ రెండు సినిమాల రిలీజ్ లు వాయిదా


ismart shankar
ismart shankar

జూలై 5 న దొరసాని , జూలై 12 న ఇస్మార్ట్ శంకర్ చిత్రాలను విడుదల చేయనున్నాం అంటూ చాలా రోజుల కిందటే ప్రకటన ఇచ్చారు , ఇక రోజులు దగ్గర పడుతుండటంతో ఎక్కడో భయం పట్టుకుంది అందుకే ఆ రెండు సినిమాల రిలీజ్ లు వాయిదా వేశారు . దొరసాని జూలై 12 న విడుదల కానుందని కొత్త డేట్ ప్రకటించారు అలాగే ఇస్మార్ట్ శంకర్ జూలై 18 న రిలీజ్ అంటూ ప్రకటన గుప్పించారు. అయితే వీళ్ళు ఇంతగా భయపడటానికి కారణం ఏంటో తెలుసా ……. క్రికెట్ .

ప్రపంచ కప్ కోసం ప్రపంచ దేశాలు హోరాహోరీగా పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే . అందులో భారత్ కూడా హాట్ ఫేవరెట్ గా మారింది పైగా సినిమాలు ఎక్కువగా చూసేది యువతే కాబట్టి వాళ్ళు ప్రస్తుతం క్రికెట్ ఫీవర్ తో ఉన్నారు కాబట్టి అందుకు భయపడి తమ సినిమాల విడుదల తేదీలను వాయిదా వేసుకున్నారు . దొరసాని చిత్రంలో ఆనంద్ దేవరకొండ – శివాత్మిక జంటగా నటించగా ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో రామ్ , నభా నటేష్ , నిధి అగర్వాల్ లు నటించారు .