యూట్యూబ్‌లో ఇస్మార్ట్ హంగామా!


యూట్యూబ్‌లో ఇస్మార్ట్ హంగామా!
యూట్యూబ్‌లో ఇస్మార్ట్ హంగామా!

`ఇస్మార్ట్ శంక‌ర్‌`.. ముగ్గురి కెరీర్‌ల‌ని మ‌లుపు తిప్పింది. వ‌రుస ఫ్లాపుల్లో వున్న ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి కెరీర్‌పై కొత్త ఆశ‌లు చిగురించేలా చేసింది. ఇందులో మీరోగా న‌టించిన రామ్ ప‌రిస్థితీ అంతే. గ‌త కొన్నేళ్లుగా మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌లేద‌నే వెలితితో పాటు బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకోలేదే అన్న కోరిక‌ను తీర్చింది.

ఇక న‌టిగా కెరీర్‌ని మంద‌గించ‌డంతో న‌ట‌న‌కు బ్రేకిచ్చిన చార్మికి నిర్మాత‌గా తొలి స‌క్సెస్‌ని అందించింది. ఇలా ఈ ముగ్గురి కెరీర్‌ని `ఇస్మార్ట్ శంక‌ర్ స‌రికొత్త మ‌లుపు తిప్పింది. బాక్సాఫీస్ వ‌ద్ద 40 కోట్లు వ‌సూలు చూసి చిత్రంగా హీరో రామ్ కెరీర్‌లోనే రికార్డు సృష్టించింది. రామ్ మాసీవ్ లుక్‌, తెలంగాణ స్లాంగ్‌, మ‌ణిశ‌ర్మ సంగీతం ఈ చిత్రాన్ని బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిల‌బెట్టాయి.

‌తాజాగా ఈ చిత్రం మ‌రో రికార్డుని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని హిందీలోనూ డ‌బ్ చేశారు. డ‌బ్బింగ్ చేసి ఫిబ్ర‌వ‌రిలో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. తాజాగా ఈ చిత్రం 100 మిలియ‌న్ వ్యూస్‌ని దాటింది. దీంతో చ‌యిత్ర బృందం సంబ‌రాలు చేసుకుంటోంది. ఈ సినిమా త‌రువాత రామ్ న‌టిస్తున్న చిత్రం `రెడ్‌`. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై స్ర‌వంతి ర‌వికిష‌ర్ నిర్మిస్తున్నారు.
ఈ నెల‌లోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది.