ఇస్మార్ శంకర్ వీడియో సాంగ్.. ప్రేక్షకుల దిమ్మాక్ ఖరాబ్


Ismart Shankar Song
ఇస్మార్ శంకర్ వీడియో సాంగ్.. ప్రేక్షకుల దిమ్మాక్ ఖరాబ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. రివ్యూలు సాధారణంగా వచ్చినా ఈ మాస్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పూరి టేకింగ్, రామ్ యాక్షన్ కు తోడు ఈ చిత్రానికి సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. మణిశర్మ చాలా రోజుల తర్వాత అద్భుతమైన పాటలు ఇచ్చి జనాలను ఉర్రూతలూగించాడు. ముఖ్యంగా ఇస్మార్ శంకర్ టైటిల్ సాంగ్, దిమ్మాక్ ఖరాబ్ పాటలు యూత్ కు బాగా ఎక్కేశాయి.

అయితే సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ఈ చిత్రంలోని దిమ్మాక్ ఖరాబ్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటల కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నారు. ఈ వీడియో సాంగ్ హంగామా ఎలా ఉందనడానికి బెస్ట్ ఉదాహరణ.. మూడు రోజుల క్రితం ఈ పాటను యూట్యూబ్ లో విడుదల చేయగా, కేవలం మూడే రోజుల్లో 10 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది ఇస్మార్ట్ శంకర్.

ఇది సాధారణ ఫీట్ కాదు. చూస్తుంటే చాలా త్వరగానే ఈ పాట 100 మిలియన్ వ్యూస్ ను దాటేస్తుంది అంటున్నారు. దీంతో పాటు ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ కోసం కూడా జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ పాట కూడా త్వరలో విడుదల కానుంది.