ఇస్మార్ట్ శంకర్ ఫస్టాఫ్ ఎలా ఉందంటే !

ISmart Shankar
ISmart Shankar

రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ ఈరోజు విడుదల అయ్యింది . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఛార్మి నిర్మించగా నిధి అగర్వాల్ , నభా నటేష్ లు హీరోయిన్ లుగా నటించారు . ఊర మాస్ ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందించామని , తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు ఇస్మార్ట్ శంకర్ టీమ్ . అయితే ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఫస్టాఫ్ రిపోర్ట్ ఎలా ఉందంటే ……

ఊర మాస్ కి ఊపునిచ్చేలా ఫైట్లు ఉన్నాయి , అలాగే రామ్ యాక్టింగ్ కూడా మాస్ కు నచ్చేలా ఉంది , ఇక హీరోయిన్ ల అందాలు మాత్రమే ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి . అలాగే ఇంట్రెస్టింగ్ సీన్ తో సినిమా స్టార్ట్ అయ్యింది . అయితే యధావిధిగా పూరి తన మార్క్ టేకింగ్ చూపించాడు . ఫస్టాఫ్ విషయానికి వస్తే …… హీరోయిన్ ల గ్లామర్ మాత్రమే హైలెట్ గా నిలిచింది అలాగే రామ్ యాటిట్యూడ్ కూడా . అయితే సెకండాఫ్ పూర్తి అయితే మాత్రమే అసలు ఫలితం చెప్పొచ్చు . ఇప్పటివరకు సాగిన కథనంతో జస్ట్ ఓకే , మరి సెకండాఫ్ ఏమౌతుందో చూడాలి .