పూరి జగన్నాధ్ కు షాక్ ఇచ్చిన తమిళ రాకర్స్


Ismart Shankar
Ismart Shankar

దర్శక నిర్మాత పూరి జగన్నాధ్ కు తమిళ రాకర్స్ షాక్ ఇచ్చారు . నిన్న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని పూర్తిగా కాపీ చేసి నెట్ లో పెట్టేసారు . సినిమా మొత్తం నెట్ లో దర్శనం ఇవ్వడంతో ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందం షాక్ అయ్యింది . దాన్ని తొలగించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వీలు కావడం లేదు పాపం . కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే దాన్ని కనీసం 24 గంటలు కాకుండానే పైరసీ చేస్తున్నారు .

ఇక తమిళ రాకర్స్ అయితే సినీ ప్రముఖులకు ఛాలెంజ్ విసురుతూనే ఉన్నారు . చిన్న సినిమా , పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాలను పైరసీ చేస్తున్నారు . ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని కూడా పైరసీ చేసి పూరి జగన్నాధ్ కు షాక్ ఇచ్చారు . ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి పూరి నిర్మాత కూడా దాంతో ఆ బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది పాపం .