జూలై 12 న ఇస్మార్ట్ శంకర్


జూలై 12 న ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకులు పూరి జగన్నాధ్ . రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ , నభా నటేష్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు . రామ్ కెరీర్ లోనే ఊర మాస్ క్యారెక్టర్ చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . రామ్ కు సాలిడ్ హిట్స్ దక్కక చాలారోజులు అవుతోంది దాంతో ఇస్మార్ట్ శంకర్ తప్పకుండా ఆ విజయ తీరాలను చేర్చుతాడని భావిస్తున్నాడు .

ఇక దర్శకులు పూరి జగన్నాధ్ విషయానికి వస్తే …….. ఈ దర్శకుడు సక్సెస్ అనే ముఖం చూసి చాలా సంవత్సరాలు అవుతోంది మధ్యలో టెంపర్ అనే చిత్రం 2015 లో హిట్ అయ్యింది . దాని తర్వాత అలాగే దానికి ముందు కూడా పూరి కి సక్సెస్ లేదు . దాంతో ఈ ఇస్మార్ట్ శంకర్ పై పూరి కూడా ఆశలు పెట్టుకున్నాడు . జూలై 12న వస్తున్న ఈ చిత్రంతో హిట్ కొడితే అటు హీరో ఇటు దర్శకుడు కూడా హ్యాపీ నే ! సక్సెస్ కాకపోతేనే అసలు సమస్య .