75 కోట్ల క్లబ్ లో ఇస్మార్ట్ శంకర్


Ismart Shankar Collections
Ismart Shankar Collections

రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ 75 కోట్ల క్లబ్ లో చేరింది . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 18 న విడుదలైన విషయం తెలిసిందే . ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి ఏ సెంటర్ లలో అంతగా ఆదరణ లభించడం లేదు కానీ బిసి కేంద్రాల్లో మంచి వసూళ్లు వస్తున్నాయి దాంతో 75 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది .

రామ్ కెరీర్ లోనే నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది ఇస్మార్ట్ శంకర్ . ఇక హిట్ కోసం తపించిపోతున్న పూరి జగన్నాధ్ కు ఈ చిత్రం ఊపిరి పోసింది . నాలుగేళ్లుగా సక్సెస్ అన్నదే తెలియని పూరి కి ఆ లోటు భర్తీ చేసింది . ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన జోష్ తో మరింత వేగంగా చిత్ర నిర్మాణానికి సిద్ధం అవుతున్నాడు . రామ్ జోష్ , నిధి అగర్వాల్ , నభా నటేష్ ల గ్లామర్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి .