ఇస్మార్ట్ శంకర్ సెన్సార్ పూర్తి


Ismart shankar
Ismart shankar

ఇస్మార్ట్ శంకర్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది , ఇక ఈ సినిమాకు” ఏ ” సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు . ఈ చిత్రంలో శృంగార సన్నివేశాలు , అలాగే హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు . రామ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ , నభా నటేష్ లు హీరోయిన్ లుగా నటించారు .

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఛార్మి నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 18 న విడుదల చేయనున్నారు . ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ రావడంతో ఖంగుతిన్న పూరి తన సినిమాలకు ఏ సర్టిఫికెట్ చాలా కామన్ అంటూ దేశముదురు , పోకిరి , బిజినెస్ మెన్ చిత్రాలను ఉదాహరిస్తున్నాడు . ఇస్మార్ట్ శంకర్ విజయం అటు హీరో రామ్ కు అలాగే దర్శకులు పూరి జగన్నాధ్ కునిర్మాతగా ఛార్మి కి హీరోయిన్ నిధి అగర్వాల్ కు చాలా చాలా అవసరం, ఎందుకంటే ఈ అందరికి కూడా హిట్స్ లేక చాలా రోజులే అవుతోంది . మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో ఈనెల 18 న తేలనుంది .