ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్


ISmart Shankar
ISmart Shankar

ఇస్మార్ట్ శంకర్ మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 27 కోట్ల కు పైగా షేర్ కలెక్ట్ చేసి సంచలన విజయం సాధించింది . రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే ఇస్మార్ట్ వసూళ్లు చాలా స్మార్ట్ గా ఉన్నాయి . రెండు తెలుగు రాష్ట్రాలలో వారం రోజుల్లోనే 25 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది . దాదాపు 60 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది ఇస్మార్ట్ శంకర్ .

రేపు విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ విడుదల అవుతోంది . అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇస్మార్ట్ శంకర్ వసూళ్లు మందగించినట్లే ! ఒకవేళ డియర్ కామ్రేడ్ ప్లాప్ అయితే అప్పుడు ఇస్మార్ట్ కు మంచి గిరాకీ తగులుతుంది మళ్ళీ . వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 27కోట్ల 67 లక్షలు వసూల్ కావడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది .