ఇస్మార్ట్ అయ్యే కదా “హాఫ్ స్మార్ట్”


Ismart Shankar
Ismart Shankar

డాషింగ్ డైరెక్టర్ గా పేరు పొందిన అతి కొంతమందిలో మన టాలీవుడ్ లిస్ట్ టాప్-5 లో తన పేరు పక్క వుంటుంది (ఎందుకంటే అతని పేరు ఆ లిస్ట్ లో నుండి వెల్లదు అంతలా సినిమాల విషయంలో డేరింగ్ అండ్ డాషింగ్ కాబట్టి). అతను ఎవరో కాదు వన్ అండ్ ఓన్లీ “పూరీ జగన్నాధ్”.

అతను నమ్మే సిద్ధాంతం ఎన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చిన మనల్ని ఒక్క హిట్ సినిమా మార్చేస్తుంది అని చాలా సార్లు చాలా ఇంటెర్వీవ్స్ లో చెప్పాడు. ఇక విషయానికి వొస్తే ఈ సంవత్సరం జులై నెలలో విడుదల అయిన సినిమా “ఇస్మార్ట్-శంకర్”, ఆ టీం మొత్తానికి ఎంత పెద్ద విజయం తెచ్చిపెట్టిందో మన అందరికీ తెలిసిన విషయమే.

అంతకు ముందు కూడా అటు హీరో “రామ్” కి కానీ, ఇటు డైరెక్టర్ “పూరీ జగన్నాధ్” కి కానీ ముందు ఫ్లాప్ సినిమాలు వున్నాయి. పూరీ జగన్నాధ్ గారు నమ్మిన సిద్ధాంతమే అతనికి విజయం దక్కేలా చేసింది.

ఇక ఈ సినిమాకి ఒకరు అయిన ప్రొడ్యూసర్ లో టాలీవుడ్ ముద్దుగుమ్మ మన అందరికీ సూపరిచితురాలు అయిన “ఛార్మి కౌర్”, ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్నందున తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు, అలాగే హీరోయిన్స్ అయిన “నబా నటేశ్” మరియు “నిధి అగర్వాల్” కూడా తమ ఆనందాన్ని ట్విటర్ మరియు ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్స్ షేర్ చేసుకున్నారు.

ఛార్మి మరియు పూరీ జగన్నాధ్ కలయికలో (ప్రొడ్యూసర్-డైరెక్టర్) ఇస్మార్ట్-శంకర్ కి కొనసాగింపు గా 2 వ పార్ట్ కూడా వుంటుంది అని, దానికి “డబల్-ఇస్మార్ట్” అని పేరు కూడా రిజిస్ట్రేషన్ చేయించారు అని ఫిల్మ్ నగర్లో భోగట్టా. ఇక అదే కనక నిజమైతే అటు రామ్ ఫ్యాన్స్ కి కానీ, ఇటు పూరీ జగన్నాధ్ కి కానీ పునకాలే అని ఫ్యాన్స్ అందరి కోరికా.