ఇస్మార్ట్ శంకర్ రివ్యూ

ismart shankar review in telugu
ismart shankar review in telugu

నటీనటులు : రామ్ , నభా నటేష్ , నిధి అగర్వాల్
సంగీతం : మణిశర్మ
నిర్మాతలు : ఛార్మి – పూరి జగన్నాధ్
దర్శకత్వం : పూరి జగన్నాధ్
రేటింగ్ : 2. 5 /5 
రిలీజ్ డేట్ : 18 జూలై 2019

రామ్ లుక్ తో ఇస్మార్ట్ శంకర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరెకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :
సెటిల్ మెంట్లు చేసే శంకర్ ( రామ్ ) చాందిని ( నభా నటేష్ ) ని ప్రేమిస్తాడు . అయితే పొలిటిషన్ కాశి రెడ్డి ని చంపేస్తాడు శంకర్ , అతడిని చంపి జైలుకి వెళ్లిన శంకర్ అక్కడి నుండి తప్పించుకుంటాడు . జైలు నుండి తప్పించుకున్న శంకర్ మెదడు లోకి మరో వ్యక్తి జ్ఞాపకాలను ట్రాన్స్ ప్లాంట్ చేస్తుంది సైన్టిస్ట్ పింకీ (నిధి అగర్వాల్ ) . అసలు ఈ జ్ఞాపకాలు ఏంటి ? వాటిని శంకర్ తలలోకి ఎందుకు ఎక్కించారు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :
రామ్
మణిశర్మ నేపథ్య సంగీతం
మాస్ ఎలిమెంట్స్

డ్రా బ్యాక్స్ :
స్క్రీన్ ప్లే
రొటీన్ ఫార్ములా

నటీనటుల ప్రతిభ :
రామ్ శంకర్ పాత్రలో పూర్తిస్థాయిలో మెప్పించాడు . మేకోవర్ తో ఇస్మార్ట్ అనిపించాడు రామ్ . తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్నాడు రామ్ . ఇక సిక్స్ ప్యాక్ లో అదరగొట్టాడు . హీరోయిన్ ల విషయానికి వస్తే నిధి అగర్వాల్ , నభా నటేష్ లు ఇద్దరు కూడా గ్లామర్ తో చంపేశారు . కుర్రాళ్లకు ఈ ఇద్దరు అందాలతో విందు చేసారు . ఇక నటనతో కూడా మెప్పించారు .

సాంకేతిక వర్గం :
వరుస పరాజయాలతో తీవ్ర అసహనంతో ఉన్న పూరి ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని కసిగా ఈ సినిమా చేసాడు . అయితే ఊర మాస్ కు బాగా నచ్చే అంశాలతో తెరకెక్కించాడు కానీ ఏ సెంటర్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోలేకపోయాడు . మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి హైలెట్ . రీ రికార్డింగ్ తో ఇస్మార్ట్ శంకర్ మరింతగా ఎలివేట్ అయ్యింది . విజువల్స్ బాగున్నాయి .

ఓవరాల్ గా :
ఇస్మార్ట్ శంకర్ మాస్ కు మాత్రమే !