ఇస్మార్ట్ నుండి రెండో ట్రైలర్ వస్తోంది!!


ismart shankar second trailer
ismart shankar second trailer poster

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి  జగన్నాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రంఇస్మార్ట్ శంకర్“. నిధి అగర్వాల్, నాభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సత్య దేవ్, ప్రముఖ క్రికెట్ యాంకర్ మందిరా బేడీ ముఖ్య పాత్రల్లో నటించారు. పూరి కెనెక్ట్స బ్యానరుపై పూరి జగన్నాద్, ఛార్మి కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ఈ చిత్రం ఈ నెల 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. పూరి, మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన పోకిరి చిత్రం మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

మళ్ళీ చాలా కాలం తరువాత వీళ్లిద్దరి కలయికలో వస్తోన్న ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతోందని కాన్ఫిడెంట్ తో వున్నారు చిత్ర యూనిట్. కాగా ఇస్మార్ట్ శంకర్ నుండి రెండో ట్రైలర్ ని ఈరోజు సాయంత్రం 5గంటలకు విడుదల చేస్తున్నారు. కొంత కాలంగా ప్లాపులతో సతమతమవుతున్న పూరి ఇస్మార్ట్ తో నైనా విజయం సాదిస్తాడో లేదో చూడాలి మరి!!