చకచకా తెలుగు మాట్లాడుతున్న విదేశీయుడు..!

Issac Richard
Issac Richard

కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు ముద్దుల తనయ మంచు లక్ష్మి అమెరికాకు చెందిన ఐసాక్‌ రిచర్డ్‌ ని ప్రేమ విహాహం చేసుకున్న విషయం తెలిసిందే..! అతను చకచకా తెలుగు మాట్లాడుతూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు . ఇటీవల ఆయనకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అయ్యింది. అందులో ఐసాక్‌ తెలుగు భాష అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఆ వీడియోకు ఎక్కువ వ్యూస్‌ లభించాయి. ఈ విషయం తెలుసుకున్న ఐసాక్‌ తాజాగా స్పందించారు.

నేను అమెరికాకు చెందిన వ్యక్తిని, రెండేళ్లు భారత్‌లో ఉన్నాను, ‘ఓ ఏడాది వైజాగ్‌లో, మరో ఏడాది విజయవాడలో ఉన్నాను. అక్కడే తెలుగు నేర్చుకున్నాను. నేను తెలుగు మాట్లాడటం గొప్ప విషయమా?. నా వీడియో ఎందుకు తీస్తున్నారని మొదట అనుకున్నాను. కానీ దానికి మంచి స్పందన వచ్చింది. ఫేస్‌బుక్‌ ద్వారా త్వరలో నేనే మీతో మాట్లాడుతా.. అన్నారు. ఈ వీడియోని దినేష్‌ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోకి నెటిజన్లు, సెలబ్రిటీస్ నుండి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

ఈ వీడియోని చూసిన నటి మంచు లక్ష్మి ట్విటర్‌లో స్పందించారు. ‘అతడు నాకంటే బాగా తెలుగు మాట్లాడుతున్నాడు (నవ్వుతున్న ఎమోజీ). మన భాషను విదేశీయులు ఇష్టపడటం చాలా సంతోషంగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు. ‘నీ దుంపతెగ.. ఎంత బాగా మాట్లాడుతున్నావ్‌..’ అంటూ నటుడు బ్రహ్మాజీ కూడా ఈ వీడియోము చూసి కామెంట్‌ చేశారు..!!