“ఈ డబ్బులకు లెక్క ఏది.?” విజయ్ పై ఐటీ దాడి వివాదం

“ఈ డబ్బులకు లెక్క ఏది.?” విజయ్ పై  ఐటీ దాడి వివాదం
“ఈ డబ్బులకు లెక్క ఏది.?” విజయ్ పై ఐటీ దాడి వివాదం

గతంలో తమిళనాడులో రెండు రాజకీయ పార్టీల మధ్య ఆట లాగా సాగింది రాజకీయం. ఎప్పుడైతే రెండు రాజకీయ వర్గాలకు చెందిన ఇద్దరు నేతలు మరణించడంతో ఇప్పుడు చాలా మంది ఆశవహులకు తమిళ నాడు ముఖ్యమంత్రి కుర్చీ పై కన్ను పడింది. ఇప్పటివరకూ ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం నడిచిన తమిళనాడు లో జాతీయ రాజకీయ పార్టీలు తమ దృష్టి సారించాయి. ఇక ఆ కొంతమంది ఆశవహులకు తోడుగా తమ ఉనికి, వ్యాపారం, ఆధిపత్యం కోసం మిగిలిన తెర వెనుకశక్తులు పావులు కదుపుతున్నాయి. గత 5 ఏళ్ళుగా తమిళ సినిమాలు ఒక్కసారి పరిశీలిస్తే అందరు నటులు కథలు ఇలాంటివి ఎంచుకున్నా, కానీ కల్చర్ పరంగా తమిళ సంస్కృతి ని అంతర్లీనంగా చూపించడం జరుగుతోంది.

ప్రస్తుతం తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ కూడా రాజకేయల్లోకి వస్తారనే ప్రచారం ఉంది. దానికి తోడూ గత కొన్ని సినిమాలుగా ఆయన తను ఎంచుకునే కథలు, క్యారెక్టర్లు, డైలాగ్స్ లో కూడా ఆ ఫీల్ ఇస్తూ వస్తున్నారు. ఇక హిందుత్వానికి వ్యతిరేకంగా రామస్వామి నాయకర్ కలం నుండి ఒక వర్గం అధికారం కోసం ఒక కొత్త ఐడియాలజీ ని “ద్రవిడ వాదం” పేరుతో తీసుకువచ్చారు. నాస్తికత్వం ముసుగులో హిండుమతంపై విద్వేషాలు నూరిపోయ్యడం వీళ్ళ ప్రధాన అజెండా. ఇప్పుడు ఉన్నట్టుండి కమల్ హసన్, ప్రకాష్ రాజ్, విజయ్ వంటి వాళ్ళు బీజేపీ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటం, రజనీకాంత్ తోపాటు ఇప్పుడు తెలుగు లో పవన్ కళ్యాణ్ లాంటి వారు బీజేపీ కు అనుకూలంగా మాట్లాడటం అంతా ఒక రాజకీయ క్రీడ మాదిరిగా ఉంది. ఇప్పుడు కొత్తగా విజయ్ నటించిన “బిగిల్” సినిమాకు సంబంధించి సదరు నిర్మాత కుమార్తె ట్విటర్ లో పెట్టిన పోస్ట్ ల ఆధారంగానే IT శాఖ వారు సోదాలు నిర్వహించామని చెప్తూ, సోదాల్లో దొరికిన కోట్ల డబ్బు, వజ్రాలు వంటివి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. నటుడు విజయ్ ఎంతోకాలంగా ఆదాయపు పన్ను విషయంలో నిర్లక్ష్య వైఖరి తో వ్యవహరిస్తున్నరనే విషయం కూడా తెలుస్తోంది. ఇక ఈ సమస్యను వీలైనంత రాజకీయ లబ్ధికి ఉపయోగించే అవకాశం ఉంది.