ఏపీలో కలకలం సృష్టిస్తున్న ఐటీ దాడులు


IT rides on AP leaders

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఐటీ దాడులు జరుగుతున్నాయి . కేంద్ర ప్రభుత్వం పై , ప్రధాని నరేంద్ర మోడీ పై గతకొంత కాలంగా నిప్పులు చెరుగుతున్న చంద్రబాబు ని అష్టదిగ్బంధనం చేయడానికి కేంద్రం భారీ ఎత్తున కుట్ర పన్నుతోంది . ఈరోజు తెల్లవారు ఝాము నుంచే పెద్ద ఎత్తున ఐటీ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడింది . తెలుగుదేశం పార్టీకి , చంద్రబాబు కు సన్నిహితంగా ఉండే వ్యాపారుల ఇళ్లలో అలాగే కార్యాలయాలలో ఐటీ దాడులు జరుగుతున్నాయి . నెల్లూరు జిల్లా కు చెందిన తెలుగుదేశం నాయకుడు , వ్యాపారి అయిన బీద మస్తాన్ రావు కార్యాలయాలపై దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు ఈరోజు విజయవాడ , గుంటూరు లలో పలువురు వ్యాపారాలు , రాజకీయ నాయకుల ఇళ్లల్లో దాడులు నిర్వహిస్తున్నారు .

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కి అత్యంత సన్నిహితుడైన మంత్రి నారాయణ కు చెందిన నారాయణ విద్యా సంస్థల్లో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది అయితే కొద్దిసేపటి క్రితం మంత్రి నారాయణ మాత్రం ఐటీ దాడులు మా విద్యా సంస్థల్లో జరగలేదు అని ప్రకటించారు . తెలంగాణలో రేవంత్ రెడ్డి తదితరులపై ఐటీ , ఈడీ అధికారులు దాడులు నిర్వహించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు . కేంద్ర ప్రభుత్వం కు చంద్రబాబు గుడ్ బై చెప్పడంతో రాజకీయంగా బాబు ని అణగదొక్కడానికి భారీ ప్రయత్నాలే చేస్తున్నారు . బెంగుళూర్ , ఢిల్లీ , చెన్నై లకు చెందిన పలువురు ఐటీ అధికారులు ఈ దాడులలో పాల్గొంటున్నారు .

English Title: IT rides on AP leaders