మద్యం మత్తులో దొరికిన భామ


 Item Girl caught red handed in midnight by Police

మద్యం సేవించి స్వయంగా డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది తమిళ భామ గాయత్రి రఘురాం . ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది తమిళనాడులో . ఓ స్టార్ హోటల్ లో ఇచ్చిన పార్టీలో పాల్గొని అర్ధరాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో చెన్నై మహానగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా స్పెషల్ డ్రైవ్ చేస్తున్న సమయంలో గాయత్రి రఘురాం కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా ఫుల్లుగా మద్యం సేవించినట్లు రిపోర్ట్ రావడంతో ఆమె కారుని సీజ్ చేసి గాయత్రిని ఇంట్లో దించారట .

అయితే తెల్లవారు ఝామున ఈ సంఘటన పై స్పందించిన గాయత్రి రఘురాం అసలు నేను మద్యం సేవించలేదు , నేను షూటింగ్ పూర్తిచేసుకొని ఇంటికి వచ్చాను , నా సహచరుడు నన్ను నా ఇంట్లో డ్రాప్ చేసాడు . కానీ ఓ రిపోర్దర్ మాత్రం నేను డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినట్లు ప్రచారం చేసాడని ఆరోపిస్తోంది . తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ తెలుగులో డబ్ అయిన లవ్ ఫెయిల్యూర్ చిత్రం తో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే !

English Title:  Item Girl caught red handed in midnight by Police