రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కి ఈ రోజు డెత్ డే అంట‌!‌

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కి ఈ రోజు డెత్ డే అంట‌!‌
రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కి ఈ రోజు డెత్ డే అంట‌!‌

మూస థోర‌ణిలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా గ‌తిని `శివ‌` చిత్రంతో మార్చి స‌రికొత్త మేకింగ్‌, టేకింగ్‌ల‌తో సంచ‌ల‌నం సృష్టించారు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఆ త‌రువాత ఆయ‌న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ల‌తో పాటు గ్యాంగ్ స్ట‌ర్ మూవీస్‌, హార‌ర్, క్రైమ్‌ థ్రిల్ల‌ర్ ల‌ని రూపొందించారు. ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. గ‌త కొంత కాలంగా త‌న స్థాయిని తానే త‌గ్గించుకుంటూ వ‌స్తున్నారు. ఇదిలా వుంటే నేడు వ‌ర్మ పుట్టిన రోజు.

ఈ సంద‌ర్భంగా సెల‌బ్రిటీలు, అభిమానులు వ‌ర్మపై శుభాకాంక్ష‌ల వర్షం కురిపించారు. బ‌ర్త్‌డే విషెస్‌పై వ‌ర్మ స్పందించారు. `ఈ రోజు నా పుట్టిన రోజు కాదు. కానీ ఇది నా డెత్ డే. ఎందుకంటే ఈ రోజు నా జీవితంలో మ‌రో సంవ‌త్స‌రం చ‌నిపోయింది` అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడ‌క్ష‌న్స్ ట్విట్ట‌ర్‌లో స్పందించింది.

జీవితం అంటే ఎంత ఎక్కువ కాలం జీవించామన్న‌ది ముఖ్యమ‌ది కాదని, ఎంత గొప్ప‌గా జీవించామ‌న్న‌ది ముఖ్య‌మ‌ని తెలిపింది. అయితే వ‌ర్మ ఈ ట్వీట్‌పై స్పందించ‌లేదు కానీ రైట‌ర్‌, డైరెక్ట‌ర్ బీవీఎస్ ర‌వి బ‌ర్త్‌డే విషెస్ చెబితే నో థ్యాంక్స్ అంటూ తిర‌స్క‌రించారు.