జాను రెండు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్


జాను రెండు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్
జాను రెండు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్

శర్వానంద్, సమంత కలిసి నటించిన చిత్రం జాను. తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన 96 చిత్రానికి రీమేక్ గా ఇది తెరకెక్కింది. 96 చిత్రానికి బృందమే ఈ చిత్రానికి కూడా పనిచేయడం విశేషం. 96 ను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ జానుకు కూడా దర్శకుడు. సంగీత దర్శకుడు, కెమెరా మ్యాన్ ఇలా అందరూ తమిళ చిత్రానికి పనిచేసిన వారే. ఎంత మంది వద్దని వారిస్తున్నా దిల్ రాజు చాలా ధైర్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జాను ప్రేక్షకుల నుండి, క్రిటిక్స్ నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. శర్వానంద్, సమంతల నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సహజంగానే ఇద్దరూ మంచి నటులు కావడంతో ఇంకా మంచి స్క్రిప్ట్ దొరికేసరికి చెలరేగిపోయారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వీరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. హృద్యమైన ప్రేమకథను అంతే అందంగా చెప్పిన తీరుకి అభినందనలు తెలిపారు. అయితే ఈ సినిమాకు క్లాస్ ఆడియన్స్ కు ఎక్కువ నచ్చేలా ఉండడం, బాగా స్లో గా కూడా ఉండడం ప్రేక్షకుల నుండి కొంత నెగటివిటీ తీసుకొచ్చింది. ఏదేమైనా జాను ఒక మంచి చిత్రంగా ప్రేక్షకుల నుండి మెప్పు పొందింది.

మొదటి రోజు 2 కోట్ల పైన వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు కూడా డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మొత్తంగా రెండు రోజులకు కలిపి జాను 3.16 కోట్ల షేర్ ను సాధించింది. అయితే జానుకు టార్గెట్ భారీగానే ఉంది. 20 కోట్ల పైన వసూలు చేయాలి. మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందనేది చూడాలి.

నైజాం – Rs 1.61 కోట్లు

సీడెడ్ – Rs 49 లక్షలు

గుంటూరు – Rs 37 లక్షలు

ఉత్తరాంధ్ర – Rs 57 లక్షలు

తూర్పు గోదావరి – Rs 26 లక్షలు

పశ్చిమ గోదావరి – Rs 18 లక్షలు

కృష్ణ – Rs 27 లక్షలు

నెల్లూరు – Rs 11 లక్షలు

ఆంధ్ర + తెలంగాణ – 3.16 కోట్లు