జాను ఫస్ట్ వీకెండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్Jaanu first weekend Collections report
Jaanu first weekend Collections report

శర్వానంద్, సమంత కలిసి నటించిన చిత్రం జాను. ఈ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం 96కి రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెల్సిందే. జానుకు తెలుగు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెల్సిందే. క్రిటిక్స్ కూడా పాజిటివ్ రేటింగ్స్ ఇవ్వగా, ప్రేక్షకుల నుండి కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సి ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. గోవింద్ వసంత అందించిన మ్యూజిక్ శ్రోతల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ముఖ్యంగా జాను థీమ్ మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అదే విధంగా సమంత, శర్వానంద్ ల పెర్ఫార్మన్స్ కూడా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వారి నటనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జాను తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ ను రాబడుతూ దూసుకుపోతోంది. తొలి రోజే ఈ చిత్రం 2.12 కోట్ల షేర్ సాధించి మంచి స్టార్ట్ ను ఇవ్వగా, మూడు రోజుల్లో 5.5 కోట్ల షేర్ తో జాను పర్వాలేదనిపించింది. ఇక ఈరోజు నుండి జాను కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయన్న దానిపై సినిమా ఫలితం ఆధారపడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా జాను 20 కోట్ల మార్క్ ను టచ్ చేయాలి. అప్పుడే సినిమాను హిట్ గా పరిగణించగలం.

జాను తెలుగు రాష్ట్రాల కలెక్టన్స్ బ్రేక్ డౌన్:

నైజాం : 2.3 కోట్లు
సీడెడ్ : 69 లక్షలు
గుంటూరు : 40 లక్షలు
ఉత్తరాంధ్ర : 87 లక్షలు
తూర్పు గోదావరి : 36 లక్షలు
పశ్చిమ గోదావరి : 28 లక్షలు
కృష్ణ : 42 లక్షలు
నెల్లూరు : 18.5 లక్షలు

ఆంధ్ర + తెలంగాణ : 5.5 కోట్లు