జాను మూవీ ప్రివ్యూ


Jaanu Movie Telugu Preview
Jaanu Movie Telugu Preview

నటీనటులు: శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకత్వం: సి ప్రేమ్ కుమార్
నిర్మాత: దిల్ రాజు
సంగీతం: గోవింద్ వసంత
విడుదల తేదీ: ఫిబ్రవరి 7, 2020

శర్వానంద్, సమంత జంటగా నటించిన జాను చిత్రం మొదటి నుండి ఆసక్తిని రేకెత్తించింది. తమిళంలో క్లాసికల్ హిట్ గా నిలిచిన 96 చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అందులో విజయ్ సేతుపతి, త్రిష పోషించిన పాత్రలను తెలుగులో శర్వానంద్, సమంత పోషించారు. ఒరిజినల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేసాడు. అగ్ర నిర్మాతగా పేరొందిన దిల్ రాజు చాలా మనసు పడి నిర్మించిన సినిమా జాను.

ఒక ఎమోషనల్ లవ్ స్టోరీగా తమిళంలో ఈ చిత్రానికి చాలా మంచి పేరొచ్చింది. మరి తెలుగులో అదే విధమైన సక్సెస్ ను ఈ చిత్రం అందుకోగలదా? మాతృకను చెడకొట్టకుండా రీమేక్ ను చక్కగా తెరకెక్కించారు అన్న ప్రశంస వస్తుందా? మాతృకను మించిన మ్యాజిక్ ఈ చిత్రం క్రియేట్ చేస్తుందా? ప్రోమోలు, పాటలు ఈ చిత్రంపై మంచి అంచనాలనే నిలబెట్టాయి. చాలా వరకూ ఒరిజినల్ నే ఫాలో అవుతూ తీశారు అనిపిస్తోంది. జాను యూనిట్ మాత్రం చిత్ర విజయంపై ధీమాగా ఉన్నారు. శర్వానంద్, సమంత, దిల్ రాజు ఇలా ఎవరిని కదిపినా సూపర్ హిట్ తీశామన్న భావననే కలిగించారు. ఈ నేపథ్యంలో జాను ఎలాంటి ఫలితం అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

తన 17 ఏళ్ల కెరీర్ లో తొలిసారి రీమేక్ చేస్తున్న దిల్ రాజు ఈ చిత్రంపై ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. వరస ప్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న శర్వానంద్ కు ఈ చిత్రమైనా ఊరటనిస్తుందా? ప్రతీ ఏడాది ఒక స్పెషల్ సినిమా చేసానని చెప్పుకున్న సామ్ కు ఈ ఏడాది జాను స్పెషల్ చిత్రంగా నిలవగలదా? జాను రివ్యూ టాలీవుడ్.నెట్ లో మరి కొద్ది సమయంలో అప్డేట్ అవుతుంది. చూసి తెలుసుకోండి.