టీజ‌ర్‌టాక్‌: హృద‌యాల్ని క‌దిలించేసిందిగా!



Jaanu teaser talk 
Jaanu teaser talk

త్రిష‌, విజ‌య్ సేతుప‌తి క‌ల‌యిక‌లో రూపొందిన త‌మిళ చిత్రం `96`. ప్రేమ్‌కుమార్ తెరెక్కించిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప్రేక్ష‌కుల హృద‌యాల్ని కొల్ల‌గొట్టింది. ప్ర‌స్తుతం ప‌లు భాష‌ల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. తెలుగులో `జాను` పేరుతో దిల్ రాజు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. శ‌ర్వానంద్‌, స‌మంత జంట‌గా న‌టిస్తున్నారు. త‌మిళ మాతృక‌ని రూపొందించిన ప్రేమ్‌కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇటీవ‌లే ఈ చిత్ర టైటిల్ ఫ‌స్ట్‌లుక్‌ని రిలీజ్ చేసిన చిత్ర బృందం గురువారం టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది. టీజ‌ర్‌లో జాన‌కిగా స‌మంత‌, రామ్‌గా శ‌ర్వానంద్ క‌నిపించారు. `96` చిత్రాన్ని ఏ లొకేష‌న్‌ల‌లో చిత్రీక‌రించారో అక్క‌డే `జాను`ని తెర‌కెక్కించారు. ఫీల్‌గుడ్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ టీజ‌ర్‌లోని దృశ్యాలు కోటి భావాల్ని ప‌లికిస్తూ హృద‌యాల్ని క‌ట్టిప‌డేసేలా వుంది. శ‌ర్వానంద్ విజువ‌ల్స్‌తో టీజ‌ర్ మొద‌లైంది. ఇందులో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్‌గా శ‌ర్వానంద్ క‌నిపిస్తున్నారు.

`చాలా దూరం వెళ్లిపోయావా రామ్ ..` అని స‌మంత అడిగితే…నిన్ను ఎక్క‌డ వ‌దిలేశానో అక్క‌డే ఆగిపోయాను అని శ‌ర్వానంద్ చెబుతున్న డైలాగ్‌లు.. నేప‌థ్య సంగీతం ఓ ఫీల్‌ని క‌లిగిస్తోంది. స్కూల్‌డేస్‌లో ప్రేమ‌లో ప‌డిన ఓ జంట ఆ త‌రువాత కొన్ని కార‌ణాల వ‌ల్ల విడిపోతుంది. కొన్నేళ్ల త‌రువాత రీ యూనియ‌న్ పేరుతో 96 బ్యాచ్ మేట్స్ ఏర్పాటు చేసిన గెట్ టు గెద‌ర్ వ‌ల్ల మ‌ళ్లీ క‌లుస్తారు. ఆ త‌రువాత వారిద్ధ‌రి హృద‌యాంత‌రాల్లో మొద‌లైన భావోద్వేగాల స‌మాహ‌రంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.