జబర్దస్త్ వినోద్ పై దాడి


Jabardast vinod
Jabardast vinod

జబర్దస్త్ లో లేడీ గెటప్ లో కనిపించే వినోద్ అలియాస్ వినోదిని పై దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది . వినోద్ తాను ఉంటున్న ఫ్లాట్ ని కొనుగోలు చేయడానికి 40 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్స్ గా 18 లక్షలను ఇచ్చాడు ఓనర్ ప్రమీల కు . అయితే మిగతా సొమ్ము ఇస్తానని చెప్పినప్పటికీ ఆ ఇంటిని అమ్మేది లేదని తక్షణం ఇల్లు ఖాళీ చేయాలని గొడవకు దిగడంతో పెనుగులాట జరిగింది .

ఆ దాడిలో ప్రమీల కుటుంబ సభ్యులు వినోద్ పై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి . దాంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందిన అనంతరం పోలీసులను ఆశ్రయించాడు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . జబర్దస్త్ లో లేడీ గెటప్ తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు వినోద్ .