సినిమాలో ఆయన ఉంటే ఆ సినిమా ఇక అంతే సంగతి…


సినిమాలో ఆయన ఉంటే ఆ సినిమా ఇక అంతే సంగతి
సినిమాలో ఆయన ఉంటే ఆ సినిమా ఇక అంతే సంగతి

కొంతకాలంగా బాలీవుడ్ నటులు ఒకలు మన తెలుగు సినిమాలో ఐరన్ లెగ్ గా మారిపోయారు. ఆయన మన తెలుగు సినిమాలో ఉంటే ఆ సినిమాలు గోర పరాజయం అయ్యాయి. మరి అది గమనించని ఒక తమిళ సినిమా విడుదలకి సిద్ధం గా ఉంది. ఇక ఈ సినిమా అయినా ఆడుతుందా అంటే నమ్మకం తక్కువే అంటున్నారు.

బాలీవుడ్ నటులు ‘జాకీ ష్రాఫ్’ గత కొంతకాలంగా మన తెలుగు సినిమాలలో మార్కెటింగ్ సంపాదించాలి అని అనుకుంటున్నారు. అలా ప్రయత్నించి చేసిన సినిమాలు అన్ని బోల్తా కొట్టేసాయి. ఆ సినిమాలో నటించిన హీరోలకి వారి కెరీర్ లో పెద్ద అట్టర్ ఫ్లాప్ సినిమాలుగా మిగిలాయి. వామ్మో జాకీ ష్రాఫ్ మా హీరో సినిమాలో నటిస్తున్నారా? అయితే మా హీరో కి పెద్ద ఫ్లాప్ వచ్చి పడినట్లే అని భయపడుతున్నారు.

అస్రం, శక్తి, పంజా మొన్న వచ్చిన ప్రభాస్ సినిమా సాహో తో కలిపి అన్ని సినిమాలు జాకీ ష్రాఫ్ ఐరన్ లెగ్ వలన ఫ్లాప్ అయ్యాయి అని బల్లా గుద్ది చెప్పవచ్చు. ఇప్పుడు తెలుగులో అయిదవ సినిమాగా తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ సినిమా ‘విజిల్ (బిగిల్)’ సినిమాలోఅనువాదం అవుతుంది. ఇందులో మన ఐరన్ లెగ్ జాకీ ష్రాఫ్ గారు కూడా నటించబోతున్నారు. తెలుగు విజయ్ ఫ్యాన్స్ నిన్న విడుదల అయిన బిగిల్ ట్రైలర్ లో జాకీ ష్రాఫ్ ని చూసి లబో దిబో మంటున్నారు.

అసలే కొన్ని సినిమాలో నటించి తెలుగులో ఐరన్ లెగ్ అనిపించుకున్న జాకీ ష్రాఫ్ గారు రేపు దీపావళికి విడుదల కాబోతున్న విజిల్ సినిమాలో ఉన్నాడు కాబట్టి సినిమా విఫలం అవ్వడం కాయం అంటున్నారు. అసలే అట్లీ- విజయ్ గారి కాంబినేషన్ లో రానున్న మూడవ సినిమా ఇది. హిట్ అయితే ఇద్దరి కాంబినేషన్ కి మంచి హ్యాట్రిక్ హిట్ పేరు వస్తుంది. ఇలాంటప్పుడు సినిమాలో జాకీ ష్రాఫ్ ని పెట్టి పెద్ద సాహసమే చేస్తున్నారు అంటున్నారు జనాలు.