ఫొటోస్టోరీ: బ‌్లాక్ డ్రెస్‌లో టీజ్ చేస్తోంది!ఫొటోస్టోరీ: బ‌్లాక్ డ్రెస్‌లో టీజ్ చేస్తోంది!
ఫొటోస్టోరీ: బ‌్లాక్ డ్రెస్‌లో టీజ్ చేస్తోంది!

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట‌ర్నెట్‌ని హీటెక్కిస్తోంది. వ‌రుస గా హాట్ ఫొటోల‌తో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తూ నెటిజ‌న్స్ ని టీజ్ చేస్తోంది. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్  `సాహో` మూవీతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది. స్పెష‌ల్ సాంగ్‌లో ప్ర‌త్యేకంగా చిందేసి కుర్రకారు గుండెల్ని మెలితిప్పేసింది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ న‌టించిన  డ్రైవ్‌, మిస్ట‌ర్ సీరియ‌ల్ కిల్ల‌ర్ వంటి చిత్రాలు ఇటీవ‌లే నెట్‌ఫ్లిక్స్ లో విడుద‌ల‌య్యాయి. ఈ మూవీస్ త‌రువాత సైలెంట్‌గా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోష‌ల్ మీడియాలో మ‌ళ్లీ త‌న జోరుని చూపించ‌డం మొద‌లుపెట్టింది. ఇటీవ‌ల ఓ హాట్ పిక్‌ని ఇన్ స్టాలో షేర్ చేసి సంద‌డి చేసింది. తాజాగా మ‌రో ఫొటోని వ‌దిలింది. ప్ర‌స్తుతం అది నెట్టింట్లో సంద‌డి చేస్తోంది.

ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ సాషా జైరామ్‌తో కలిసి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోషూట్ కోసం పోజులిచ్చారు. బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో తీసిన ఈ ఫొటో షూట్‌లో తన ప్రైవేటు అందాలను బ్లాక్ జిప్పర్ టాప్ లో కవర్ చేసింది.. తాజా ఫొటోషూట్‌తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నెటిజ‌న్స్‌ని టీజ్ చేయ‌డం వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుతం జాక్వెలిన్ ఫెర్నాండెజ్  ‘భూత్ పోలీస్’ చచిత్రంలో న‌టిస్తోంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, యామి గౌతమ్ న‌టిస్తున్నారు. ఈ మూవీతో పాటు రణ్‌వీర్ సింగ్ ‘సిర్కస్’ లో కూడా జాక్వెలిన్ కనిపించ‌బోతోంది.