`జ‌గ‌డం` ఒక‌ ల‌వ్ ఫెయిల్యూర్ లాంటిది – రామ్

Jagadam is like that one love failure - ram
Jagadam is like that one love failure – ram

కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైనప్పుడు అవి ఫ్లాప్‌లుగా మిగిలిన‌ప్పటికీ చాలా కాలం గుర్తుండిపోతాయి. రామ్ పోతినేని `జగడం` అదే కోవలోకి వస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ ప్రేక్ష‌కుల్లో మాత్రం పాపుల‌ర్ అయింది. ముందు ఈ మూవీ న‌చ్చ‌క‌పోయినా ఆ త‌రువాత‌ కాలక్రమేణా ఈ మూవీని ప్రేమించడం ప్రారంభించారు. ఈ రోజుతో `జగడం` విడుదలై 14 సంవత్సరాలు పూర్త‌యింది. ఈ సందర్భంగా రామ్ ఆస‌క్తిక‌ర‌మైన‌ ట్వీట్ చేశారు.

ట్విట్ట‌ర్‌లో `జగడం` ఒక ప్రేమ వైఫల్యం లాంటిది. మీరు జీవితంలో దాన్ని ఎప్పటికీ మరచిపోలేరు. 14 సంవత్సరాల తరువాత కూడా అది ఇప్ప‌టికీ న‌న్ను వెంటాడుతోంది. ఇలాంటి సినిమా ఆడ‌క‌పోవ‌డం ఇప్పటికీ కొంచెం బాధాకరమైనదే అయినా అందంగా ఉంది. ఈ అందమైన అనుభవానికి ధన్యవాదాలు sukku . DSP మీరు జగడం` ఆత్మ`

`రత్నవేలు సార్ మీ పనిని ఎప్పటికీ మరచిపోలేము. ఆదిత్యబాబు ఈ రోజు జైదేవ్ మామను గుర్తు చేసుకున్నందుకు  మీకు ధన్యవాదాలు నా సోదరుడా. 14 సంవత్సరాల తరువాత కూడా మీరందరూ దీనిని సెల‌బ్రేట్ చేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది` అని ట్వీట్ చేశారు. అన్నారాయన. ఈ ప్రత్యేక సందర్భంగా `జగడం` ప్రత్యేక ప్రదర్శనను హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో ఈ రోజు 4 P.M ఏర్పాడు చేస్తున్న‌రు.