కేసీఆర్ ఆంధ్రోళ్లని తిడుతుంటే ఈ ఆంధ్రోళ్లకు పట్టదా ?


Jagan and Pawan kalyan wants KCR victory

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికల సందర్బంగా ఆంధ్రోళ్ళని ఘోరంగా అవమానిస్తుంటే ఆంద్రోళ్ళయిన జగన్మోహన్ రెడ్డి , పవన్ కళ్యాణ్ లు నోరు మెదపడం లేదు . కేసీఆర్ ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ సాటి ఆంధ్రులైన పవన్ కళ్యాణ్ , జగన్ లు కేసీఆర్ పై పల్లెత్తు మాట అనకపోవడానికి కారణం శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లుగా చంద్రబాబు ని అదేపనిగా తిడుతున్న కేసీఆర్ అంటే సంబర పడిపోతున్నారు జగన్ , పవన్ లు . చంద్రబాబు నాయుడి ని ఆంధ్రప్రదేశ్ లో అధికార పీఠం నుండి దూరం చేయడానికి ఆ అధికార పీఠం మీద కూర్చోవడానికి జగన్ తహతహలాడుతున్నాడు .

జగన్ మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ కు కూడా ముఖ్యమంత్రి పీఠం మీద ఆశ కలిగింది . 2019 ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి అంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసాడు . ఒకవైపు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం పై పోరాడుతుంటే , బలమైన నాయకుడు నరేంద్ర మోడీ ని ఎదురిస్తుంటే కేసీఆర్ , పవన్ కళ్యాణ్ , జగన్ మోడీ తో కుమ్మక్కై చంద్రబాబు పై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు అనుంగు సోదరులలా ? తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం మొత్తం చంద్రబాబు ని తిట్టడం , ఆంద్రోళ్ళు ….. ఆంద్రోళ్ళు అంటూ ఆడిపోసుకోవడం తప్ప నేను ఫలానా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను నాకు మళ్ళీ ఓటయ్యేండి అని మాత్రం చెప్పలేక పోతున్నాడు . ఇంతలా ఆంధ్రోళ్ల ని కేసీఆర్ తిడుతుంటే అతడ్ని విమర్శించకుండా లోపాయికారిగా జగన్ పార్టీ మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా కేసీఆర్ కు మద్దతు ఇస్తున్నారు . చంద్రబాబు బలపరుస్తున్న ప్రజా కూటమి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఆదేశాలు జారీ చేసాడట . అలాగే జగన్ కూడా తన వాళ్ళని పెద్ద ఎత్తున పురమాయించి కేసీఆర్ ని బలపరచాలని కోరాడట . జగన్ , పవన్ లు కుమ్మక్కై మోడీ – కేసీఆర్ లకు జై కొడుతూ ఆంధ్రోళ్ల పరువు తీస్తున్నారు .

English Title: Jagan and Pawan kalyan wants KCR victory