మే 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా జగన్ ?


మే 30 న ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి గా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 25 న వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో జగన్ ని శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో జగన్ ప్రభంజనం వీస్తోంది.

అధికార తెలుగుదేశం పార్టీని ఏపీ ప్రజలు చిత్తు చేయడంతో వైసిపి శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. జగన్ పాదయాత్ర జగన్ ని అధికార పీఠంపై నిలబెట్టిందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈనెల 30 న అంగరంగ వైభవంగా ఓపెన్ స్టేడియంలో జగన్ అశేష ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జగన్ పార్టీ 150 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.