జగన్ పార్టీ ముందంజఆంధ్రప్రదేశ్ లో జగన్ హవా నడుస్తోంది . ఫ్యాన్ గాలికి ఎదురు లేకుండాపోయింది ప్రస్తుతానికి . వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో దూసుకుపోతోంది . ఇక తెలుగు దేశం పార్టీ రేసులో వెనుకబడిపోయింది . ప్రస్తతం అందుతున్న సమాచారం ప్రకారం భారీ ఓట్ల శాతంతో భారీ విజయం దిశగా దూసుకుపోతోంది జగన్ పార్టీ . అయితే ముందంజలో జగన్ పార్టీ దూసుకుపోతోంది కానీ ఇదే ట్రెండ్ చివరి వరకు కొనసాగుతుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే !

ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా కనబడుతోంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే . జగన్ పార్టీ రేసులో దూసుకుపోతోంది , తెలుగుదేశం ఘోర ఓటమి పొందేలా కనిపిస్తోంది . అయితే ఇదే ట్రెండ్ మరింతగా కొనసాగితే తప్పకుండా జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని తెలుస్తోంది .