ఫిల్మ్ ఇండస్ట్రీ లో వెధవలున్నారు : జగపతిబాబు


Jagapathi babu sensational comments ఫిల్మ్ ఇండస్ట్రీ లో చాలామంది వెధవలు ఉన్నారని , అయితే వాళ్లకు వెధవలు అనే విషయం తెలియదని …. నాకు ఆ వెధవలతో సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు జగపతిబాబు . అంతేకాదు గూఢచారి చిత్రాన్ని చూసి తెలుగు చిత్ర పరిశ్రమ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని సంచలన వ్యాఖ్యలు చేసాడు జగపతిబాబు . ఈ హీరో కం విలన్ కు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో కానీ కొంతమంది వల్ల అయితే తీవ్రంగా బాధపడి ఉంటాడు అందుకే వెధవలు ఉన్నారని కామెంట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు .

హీరోగా కెరీర్ అయిపోయిన జగపతిబాబు లెజెండ్ చిత్రంతో విలన్ గా మారాడు ఇక అప్పటి నుండి సెకండ్ ఇన్నింగ్స్ యమా జోరుగా సాగుతోంది జగపతిబాబు కెరీర్ . కొంతమంది వల్ల నష్టపోయిన జగపతిబాబు మొత్తానికి రెండో ఇన్నింగ్స్ తో భారీగానే ఆస్థులను కూడబెట్టుకున్నాడు . అయితే తాజాగా జరిగిన ఓ వేడుకలో ఇండస్ట్రీలో వెధవలు ఉన్నారని , వాళ్లకు నాకు సంబంధం లేదని అనడం మాత్రం సంచలనం అవుతోంది . అన్నట్లు జగపతిబాబు ఇండస్ట్రీ కి వచ్చి అప్పుడే ముప్పై ఏళ్ళు అయ్యాయి అయితే ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పఁలేదని అంటున్నాడు అందుకే ఎవరూ వేడుకలు చేయలేదని చెబుతున్నాడు పరోక్షంగా .

English Title: jagapathi babu sensational comments