జగపతిబాబు బయోపిక్ కూడా వస్తోందట


jagapathibabu biopic on cardsబయోపిక్ ల ట్రెండ్ నడుస్తుండటంతో పలు బయోపిక్ చిత్రాలను రూపొందించడానికి ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు . ఇప్పటికే పలు బయోపిక్ లు షూటింగ్ జరుపుకుంటుండగా మరికొన్ని చిత్రాలు సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి . ఇక అందులో భాగంగానే హీరో జగపతిబాబు బయోపిక్ ని కూడా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు . జగపతిబాబు హీరోగా నటించాలని పరితపించి హీరో అవ్వడం , మొదట్లో తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవడం……… అసలు ఇతను హీరోగా పనికొస్తాడా ? అన్న విమర్శల నుండి సక్సెస్ సాధించడమే కాకుండా శోభన్ బాబు తర్వాత అంతటి ఇమేజ్ ని పొంది మహిళా అభిమానులను సొంతం చేసుకున్న వ్యక్తి జగపతిబాబు . ఇలా జగపతిబాబు కెరీర్ లోని ఉత్థాన పతనాలను ఈ బయోపిక్ లో చూపించనున్నారట .

అయితే ఈ బయోపిక్ వెండితెర మీదకు రాదట కేవలం బుల్లితెర కోసం చేస్తున్నారట ! అవును వెండితెర అంటే రిలీజ్ ప్రమోషన్ ఇలా బోలెడు ప్రహసనాలు ఉన్నాయి అవన్నీ చేయాలంటే కష్టం కాబట్టి బుల్లితెర పై ఈ ప్రయోగం చేస్తున్నారట . జగపతిబాబు కి మహిళా అభిమానులు ఎక్కువ కాబట్టి బుల్లితెర అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారట ఆ బయోపిక్ బృందం . ఇక త్వరలోనే దీనికి సంబందించిన పూర్తి వివరాలను తెలియజేయనున్నారట .

English Title: jagapathibabu biopic on cards