మహేష్ పాలిట విలన్ ఈ నటుడు


మహేష్ బాబు మహర్షి చిత్రం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే . ఇక ఈ సినిమాలో విలన్ గా జగపతి బాబు ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రంతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతిబాబు అదే జోరుతో రెచ్చిపోతున్నాడు . విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు జగపతిబాబు .

అయితే ఈమధ్య జగపతి బాబు సాఫ్ట్ క్యారెక్టర్ లు పోషిస్తుండగా మరోసారి మహేష్ సినిమాతో విలన్ గా నటించడానికి సిద్ధం అవుతున్నాడు జగపతిబాబు . ఇంతకుముందు మహేష్ బాబు – జగపతిబాబు తండ్రీ కొడుకులుగా శ్రీమంతుడు చిత్రంలో నటించారు . ఇక ఇప్పుడేమో మహేష్ పాలిట విలన్ అవుతున్నాడు జగపతి . అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు – అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించనున్నారు .