జగ్గూ భాయ్ హవా తగ్గిపోతోందా?


Jagapati babu has no movie offers
Jagapati babu has no movie offers

హీరోగా జగపతి బాబు హవా తగ్గిపోయిన విషయం ముందే తెలుసుకుని క్యారెక్టర్ పాత్రలకు, విలన్ పాత్రలకు సై అన్నాడు. అది ఎంత మంచి నిర్ణయమో తర్వాత అందరికీ తెలిసొచ్చింది. లెజండ్ తో విలన్ గా మారిన జగపతి బాబు తర్వాత వెనుతిరిగి చూసిందిలేదు. 2014లో లెజండ్ విడుదలవ్వగా అప్పటినుండి జగపతి బాబు తీరిక అన్నది లేకుండా నటిస్తూనే ఉన్నాడు. స్టార్ హీరోలకు తండ్రిగా, వాళ్ళ సినిమాల్లో విలన్ గా కీలక పాత్రలు పోషించాడు జగపతి బాబు. అయితే ఈ ఏడాది జగపతి బాబు హవా తగ్గిపోయిందేమో అనిపిస్తోంది. ఎందుకంటే 2019లో జగపతి బాబు నుండి అంత చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. జగపతి బాబుకు ప్రత్యామ్నాయాలు వెతికే పనిలో దర్శకులు ఉన్నారు. జగ్గూ భాయ్ ఉంటే రొటీన్ అవుతోంది అనుకుంటున్నారో ఏమో అందుకే బాలీవుడ్ నటులనైనా తెచ్చుకుందామని ఫిక్స్ అయ్యారు.

ఈ ఏడాది జగపతి బాబు నటించిన సినిమాల లిస్ట్ ఒకసారి చూసుకుంటే మహేష్ బాబు నటించిన మహర్షిలో విలన్ గా నటించాడు. అయితే అది 2018లో ఒప్పుకున్న సినిమానే. చిరంజీవి సైరా నరసింహారెడ్డిలో కూడా ఒక కీలక పాత్రను చేసాడు జగ్గూ భాయ్. అది కూడా 2018 ఆరంభంలోనే ఒప్పుకున్నాడు. సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ఓ బేబీ చిత్రంలో ఒక చిన్న కేమియో పాత్రలో కనిపించాడు. అది కూడా 2018లో ఒప్పుకున్నా సినిమానే. 2019 మొదట్లో యాత్ర చిత్రంలో కూడా వైఎస్ రాజారెడ్డి పాత్రలో నటించాడు.

ఇలా ఈ ఏడాది చేసినవే తక్కువ చిత్రాలు, అందులో కూడా పెద్ద పేరున్న పాత్రలు లేవు. అవి కూడా క్రితం సంవత్సరం ఒప్పుకున్న సినిమాలే ఇవి. ఈ ఏడాది ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు జగ్గూ భాయ్. లేదా ఒక్క సినిమా కూడా తన వద్దకు రాలేదు. ప్రస్తుతం జగపతి బాబు చేతిలో తన్హాజి అనే ఒకే ఒక్క హిందీ సినిమా ఉంది. మరి ఎందుకని జగ్గూ భాయ్ కి సడెన్ గా అవకాశాలు తగ్గిపోయాయన్నది తెలియట్లేదు. మరి ఈ పరిస్థితి నుండి జగపతి బాబు బౌన్స్ బ్యాక్ అవ్వగలడో లేదో చూడాలి.