కొత్త లుక్ ను షేర్ చేసిన జగపతి బాబు

కొత్త లుక్ ను షేర్ చేసిన జగపతి బాబు
కొత్త లుక్ ను షేర్ చేసిన జగపతి బాబు

నటుడు జగపతి బాబు విలన్ గా మారాక తన కెరీర్ స్వరూపమే మారిపోయింది. లెజండ్ తో విలన్ గా మారిన జగపతి బాబు ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. విలన్ గా మాత్రమే కాకుండా తండ్రి పాత్రలకు కూడా ఎస్ చెప్పి ఆ వైపుగా కూడా జగపతి బాబు ఇంప్రెస్ చేసాడు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే జగపతి బాబు రీసెంట్ గా తన లుక్ ను షేర్ చేసుకున్నాడు. “నా కొత్త కెరీర్ లుక్” అన్న క్యాప్షన్ ను ఆ ఫోటోకు జత చేసాడు. ఈ కొత్త లుక్ లో నిజంగానే జగ్గూ భాయ్ కొత్తగా ఉన్నాడు. హెయిర్ ను మొత్తానికి తగ్గించేసి గెడ్డం, మీసం విషయంలో మాత్రం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కు స్టిక్ అయ్యాడు.

ఆ క్యాప్షన్ ను బట్టి ఫ్యూచర్ లో రానున్న చిత్రాలకు జగపతి బాబు ఈ లుక్ లోనే కనిపిస్తాడని తెలుస్తోంది.