ఏబీఎన్ రాధాకృష్ణ పై అరెస్ట్ వారెంట్


ABN Radhakrishna
ABN Radhakrishna

ఆంధ్రజ్యోతి , ఏబీఎన్ ల అధినేత రాధాకృష్ణ పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది . జగ్గయ్య కోర్టు ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది . తప్పుడు వార్తలు ప్రచురించారంటూ జగ్గయ్యపేట కు చెందిన ముత్యాల సైడేశ్వర్ రావు కోర్టుని ఆశ్రయించాడు . ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ పై అలాగే ఎడిటర్ శ్రీనివాస్ తో పాటుగా లోకల్ రిపోర్టర్ వెంకట రమేష్ , నాగేశ్వర్ రావు లపై కేసు పెట్టాడు .

రెండేళ్ల క్రితం సైదేశ్వర్ రావు భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆ భూమిపై అసత్య ఆరోపణలు చేస్తూ వార్తా కథనాన్ని ప్రచురించారు . దాంతో అవమానకరంగా భావించిన సైడేశ్వర్ రావు జగ్గయ్యపేట కోర్టుని ఆశ్రయించగా రాధాకృష్ణ , శ్రీనివాస్ లతో పాటుగా లోకల్ రిపోర్టర్ లకు కూడా సమన్లు పంపించినప్పటికీ కోర్టుకి హాజరు కాలేదు దాంతో ఆగ్రహించిన జగ్గయ్యపేట కోర్టు రాధాకృష్ణ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది .