సైరా లో విలన్ తెలిసింది.. ఇది నిజమేనా ?


Syeraa
సైరా లో విలన్ తెలిసింది.. ఇది నిజమేనా ?

ప్రతిష్ఠాత్మకంగా భారీ విలువలతో, ఎక్కువ వ్యయంతో తెరకెక్కిన సినిమా “సైరా” అక్టోబర్ 02 వ తారీఖున గాంధీ జయంతి రోజున విడుదల అవుతుంది అని ప్రకటించారు. నిన్న జరిగిన ఆడియో విడుదల కూడా భారీగా ఒక పక్క వర్షం పడుతున్నా కూడా అభిమానులు చిరంజీవి కోసం వచ్చారు. సినిమా, రాజకీయనాయకులు లాంటి సెలెబ్రెటీస్ కూడా చాలా మంది హాజరు అయ్యారు.

అయితే సినిమా సభ్యులు అందరూ కొద్ది కొద్దీగా సమయం తీసుకొని వాళ్ళ అనుభూతులని, సినిమా మీద ఉన్న ఇష్టాన్ని గురించి మాట్లాడారు. అతిధులుగా వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మొదలుకొని రాజమౌళి వరకు అందరూ చిరంజీవి , చిరంజీవి తనయుడు రామ్ చరణ్ గురించి పొగడ్తలతో ముంచెత్తారు.

జగపతి బాబు గారు మాట్లాడిన కొద్దీ సేపటికి, చిరంజీవి గారు జగపతి బాబు గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో జగపతి బాబు గారు మంచి పాత్ర చేశారు, ఇందులో తనది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని, చాలా రకాలుగా ఉంటుంది అని అన్నారు. చిరంజీవి గారు జగపతి బాబు చేసిన “వీరా రెడ్డి” క్యారెక్టర్ గురించి అలా అనడంతో అందరూ జగపతి బాబు గారే ఈ సినిమాలో విలన్ అని అంటున్నారు.

మరి చిరంజీవి గారు చెప్పిన దాంట్లో ఎంత నిజముందో సినిమా విడుదల అయినా రోజు తెలుస్తుంది అని అంటున్నారు సినిమా విశ్లేషకులు అంటున్నారు.