జై సేన మంచి విజయం సాధించాలి అంటున్న మెగాబ్రదర్



Jai Sena
Jai Sena

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయిఅరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’.

ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన సునీల్‌ టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌, టైటిల్‌ సాంగ్‌ను మెగాబ్రదర్‌ నాగబాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వి.సముద్ర, కో ప్రొడ్యూసర్‌: శిరీష్‌రెడ్డి, హీరోలు శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు. ‘హలో మిత్రమా……సేన జై సేన సేన.. మా స్టూడెంట్స్‌ పవరేంటో తెలిపేదే సేన.. యుద్ధం చెయ్‌, యుద్ధం చెయ్‌, యుద్ధం చెయ్‌రా..’ అంటూ సాగే ఈ పాటలో ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ డ్రెస్‌తో, ఆర్మీ యూనిఫాంలో ఉన్న యంగ్‌స్టర్స్‌ కనిపిస్తారు.

అలాగే మన జాతీయ జెండాను కూడా ప్రొజెక్ట్‌ చేయడంతో ఈ పాట ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తోంది. ‘జైసేన’ సాంగ్‌ను విడుదల చేసిన అనంతరం మెగాబ్రదర్‌ నాగబాబు మాట్లాడుతూ.. ఈ సినిమాకి ‘జైసేన‘ అనే టైటిల్‌ పెట్టారు. యంగ్‌స్టర్స్‌ ఈ సినిమాలో మంచి పాత్రలు పోషించారు. శ్రీకాంత్‌, సునీల్‌ ప్రముఖ క్యారెక్టర్స్‌ చేశారు. సాంగ్‌ చూసినపుడు యూత్‌ అండ్‌ పొలిటికల్‌ మూవీ అనిపించింది. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ, ఈ సినిమాకి దర్శకత్వం వహించి నిర్మిస్తున్న సముద్రగారికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్తున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.