జమున బయోపిక్ తీసే దమ్ముందా ?


నా బయోపిక్ తీసే దమ్మున్న వాళ్ళు టాలీవుడ్ లో ఎవరున్నారు ? అని అంటోంది సీనియర్ నటి జమున . ఎన్టీఆర్ , అక్కినేని ల కాలంలో స్టార్ హీరోయిన్ గా ఓవెలుగు వెలిగిన ఈ సీనియర్ నటి ఒకదశలో ఆనాటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్ , అక్కినేని లను సవాల్ చేసింది . మీకు తలవంచేది లేదు అంటూ వాళ్లకు ఎదురు తిరగడమే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోలకు సమానమైన ఇమేజ్ ని తెచ్చుకుంది .

అయితే ఫిలిం ఇండస్ట్రీ లోని పలువురు ప్రముఖులు జోక్యం చేసుకోవడంతో తగ్గి మళ్ళీ ఎన్టీఆర్ , అక్కినేని ల సరసన నటించింది . దాంతో నా బయోపిక్ తీసే దమ్ము ఎవరికుంది ? అంటూ సవాల్ చేస్తోంది . ఎందుకంటే జమున బయోపిక్ తీస్తే తప్పకుండా ఎన్టీఆర్ , అక్కినేని నాగేశ్వర్ రావు లతో ఎందుకు విబేధాలు వచ్చాయి ? ఎలా పరిష్కారం అయ్యాయి ? తప్పు ఎవరిది ? తదితర విషయాలను చెప్పాల్సి ఉంటుంది ? అంటే ఎన్టీఆర్ , అక్కినేని లను కాస్త నెగెటివ్ గా చూపించాల్సిందే . అలా చూపిస్తే పెద్ద పెద్ద గొడవలు జరగడం ఖాయం . అందుకే నా బయోపిక్ తీసే దమ్ము ఎవరికుంది ? అని ప్రశ్నిస్తోంది జమున .