జనసేన మొదటి జాబితా విడుదల


Janasena first list out 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి జాబితాని విడుదల చేసాడు . ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం తో  జనసేన పొత్తు పెట్టుకుంటుందని అనుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఇద్దరు కూడా పొత్తు లేదని స్పష్టం చేయడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో త్రిముఖ పోరు సాగనుంది . జగన్ వై ఎస్సార్ కాంగ్రెస్ , తెలుగు దేశం , జనసేన ఇలా మూడు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది .

 

అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో దిగుతున్నప్పటికీ జనసేన పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది . కాకపోతే కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి నష్టం చేసేలా ఉంది . జనసేన తరుపున 32 మందితో కూడిన లిస్ట్ ని ప్రకటించాడు పవన్ . 32 మంది అసెంబ్లీకి పోటీ చేస్తుండగా నలుగురు పార్లమెంట్ సభ్యులను కూడా ప్రకటించాడు . ఇక జగన్ ఈనెల 16 న తోలి జాబితా విడుదల చేయనున్నాడు . పవన్ కళ్యాణ్ ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలలో ఎక్కువగా ఉండనుందని మిగతా చోట్లా అంతగా ప్రభావం లేదని అంటున్నారు . కానీ చూడాలి ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో ?

English Title: Janasena first list out