జాన్వీక‌పూర్ పెళ్లికి సిద్ధ‌మ‌వుతోందా?


జాన్వీక‌పూర్ పెళ్లికి సిద్ధ‌మ‌వుతోందా?
జాన్వీక‌పూర్ పెళ్లికి సిద్ధ‌మ‌వుతోందా?

ఎక్క‌డ చూసినా ఇప్పుడు పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తోంది. టాలీవుడ్‌లో అయితే ఇటీవ‌ల వ‌రుస వివాహాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే అతిలోక సుందరి గారాల ప‌ట్టి జాన్వీక‌పూర్ కూడా పెళ్లికి రెడీ అవుతోందా? అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. `గుంజ‌న్ స‌క్సేనా` చిత్రంతో ఇటీవ‌లే సంద‌డి చేసిన జాన్వీ క‌పూర్ తాజాగా పెళ్లి కూతురిగా ముస్తాబై షాకిచ్చింది.

జాన్వీ పెళ్లి కూతురిగా ముస్తాబైన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తోంది. పెళ్లి కూత‌రుగా ముస్తాబై హోయ‌లు పోతోంది. మేలి ముసుగులో త‌ళుకుళీనుతూ మేలి ముసుగులో సిగ్గుల మొగ్గ‌వుతోంది. అయితే ఇది రియాల్ లైఫ్‌లో అనుకుంటే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్టే. ఓ యాడ్ షూట్‌లో భాగంగా పెళ్లి కూతురుగా ముస్తాబైంది. ప్ర‌ముఖ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హాత్రా డిజైన్ చేసిన‌ బంగారు, ఆకుప‌చ్చ రంగు లెహెంగాలో జాన్వీ పెళ్లి కూతురుగా మ‌స్తాబై మెరిసింది.

దీనికి సంబంధించిన ఫొటోలు, ఓ వీడియో సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో షేర్ చేశారు. హెరిటేజ్ క‌లెక్ష‌న్  సంద‌డి చేస్తోంది. `మీకు ఎవ‌రికైనా స‌న్నాయి మేళం వినిపిస్తోందా?  లే క నాకు ఒక్క‌దానికే అలా అనిపిస్తోందా? .. మ‌నీష్ మ‌ల్హోత్రా సరికొత్త క‌లెక్ష‌న్‌లో నేనూ ఓ భాగ‌మైనందుకు ఆనందంగా వుంది` అని జాన్వీ పేర్కొంది.