మరాఠీ లో సంచలన విజయం సాధించిన ” సైరత్ ” చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసారు . హీరో హీరోయిన్ ల నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రం కావడంతో అటు హీరో ఇషాన్ కట్టర్ కు ఇటు జాన్వి కపూర్ నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి . అంతేకాదు ఇద్దరి మద్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని ప్రశంసలు వస్తున్నాయి . కరణ్ జోహార్ సినిమా నిర్మించడం వల్ల ఈ సినిమాకు ఎక్కడా లేని ప్రాధాన్యత వచ్చింది అలాగే శ్రీదేవి కూతురు మొదటి చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది . మొత్తానికి ధడక్ చిత్రానికి రివ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి . బ్లాక్ బస్టర్ రేంజ్ కాదు కాని సూపర్ హిట్ అవ్వడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . అయితే క్రిటిక్స్ విషయాన్నీ పక్కన పెడితే యువత ని ఆకట్టుకునే చిత్రం కాబట్టి వాళ్ళకు నచ్చితే మాత్రం బ్లాక్ బస్టర్ రేంజ్ కి వెళ్ళడం ఖాయం .
English Title: janhvi kapoor dhadak premiere show talk